Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గీతగోవిందం' సినిమాకు కితాబునిచ్చిన ఎంపీ కవిత!

  • గతంలో పెద్దగా సినిమాలు చూసేదాన్ని కాదు
  • గీతగోవిందం చూశాను... చాలా బాగుంది 
  • ఇప్పుడు తెలంగాణ యాసలోను సినిమాలు వస్తున్నాయి  
ఎప్పుడూ రాజకీయాలలో బిజీగా వుండే టీఆర్ఏస్ ఎంపీ కవిత 'గీత గోవిందం' సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో తెలంగాణా యాసను హేళన చేసిన సందర్భాల్లో పెద్దగా సినిమాలు చూసేదాన్ని కాదనీ, కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ యాసలోనూ సినిమాలు వస్తున్నాయని చెప్పిన ఆమె, గీతగోవిందం సినిమా చాలా బాగుందని అన్నారు.

సినిమాలను వ్యాపార దృక్పథంతో తీస్తారన్న ఆమె, సినిమాలలో వాడే భాష దర్శక, నిర్మాతల అభిరుచి మేరకే వుంటుంది కాబట్టి, భాష విషయంలో సినిమాలను తప్పు పట్టలేమని చెప్పారు. 
Geetha Govindam
kavitha
TRS

More Telugu News